Oct 21, 2024, 07:10 IST/నిర్మల్
నిర్మల్
దిలావర్పూర్: ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. తహసీల్దార్
Oct 21, 2024, 07:10 IST
దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని తహసీల్దార్ స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. మండలంలో నెలకొని ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మార్వో ఆదేశించారు. ఇందులో ఎంపీడీవో అరుణ రాణి, ఎంపీవో గోవర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.