చిత్తూరు: మొగిలి ఘాట్ సమీపంలో కారు దగ్ధం
చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై పలమనేరు సమీపంలోని జగమర్ల వద్ద ఆదివారం ఓ కారు మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. డ్రైవర్ తెలిపిన వివరాల మేరకు. తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి దర్శనం అనంతరం ములభాగల్కు తిరుగు ప్రయాణం అయ్యారు. కారులో ఒకసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ అందులోని వారిని కిందకి దించి వేయడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి వాహనం పూర్తిగా దగ్ధమైంది.