పాతపట్నం: కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం అన్యాయం
పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం సాయంత్రం మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచమని అవసరమైతే 30% కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందన్నారు. దీపావళి నుంచి విద్యుత్ చార్జీల పెంపు, అక్రమ ఇసుక తరలింపు, ప్రైవేటు మద్యం షాపులు వంటి అంశాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మాయ మాటలతో గద్దెను ఎక్కారని ఆమె ఘాటుగా విమర్శించారు.