పలాస: ఉరేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
పలాస మండలం ఈదురాపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శాసనపురి నవ్య (30) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కాశీబుగ్గ సూదికొండ ప్రాంతంలోని ప్రభత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.