పాలకొండ: సినీ రచయిత పోసాని మురళిపై చర్యలు తీసుకోవాలి
టీటీడీ ఛైర్మన్ బి. ఆర్ నాయుడుపై వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణ మురళీ అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలంతో దూషించడంపై పాలకొండ టీడీపీ నేతలు పోలీసు స్టేషన్లో గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలపై పోసాని కృష్ణ తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రయోగమూర్తిని కోరారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.