రణస్థలంలో ఘనంగా జగన్నాథస్వామి శోభాయాత్ర
రణస్థలం మండలం కోష్ట గ్రామంలోని శ్రీ కృష్ణ చైతన్య మఠం, గో సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో శుక్రవారం గోపాష్టమిని పురస్కరించుకుని జగన్నాథ స్వామి శోభా యాత్రను ఘనంగా నిర్వహించారు. ముందుగా గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుభద్ర, బలభద్రుని, జగన్నాథ స్వామి రథంపై ప్రతిష్ఠించి హరే రామ సంకీర్తనలతో కోష్ట నుంచి రణస్థలం జాతీయ రహదారి మీదుగా ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.