ఎచ్చెర్ల: ఉచిత అన్నదానానికి 300రోజులు
రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం మంగళవారం నాటికి 300 వ రోజుకు చేరుకుందని ఓ ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని పేదలు, బాటసారులు, కూలీలు, ఇతరుల ఆకలి తీర్చడం సంతోషకరంగా ఉందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్న ఈ ఉచిత భోజన కార్యక్రమానికి ప్రజలలో ఆనందాన్ని చూడగలగుతున్నానిఅన్నారు.