ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో దిగువ ప్రాంతంలో వెలిసిన ఉద్భవ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవలో భాగంగా అమ్మవారికి అభిషేకం, ఆభరణాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.