పెనుకొండ: ఐదు నెలల్లో అనేక కార్యక్రమాలు చేశాం: మంత్రి
టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేయగలిగామని సత్యసాయి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాను ఇండస్ట్రీయల్ హాబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధి చేయలేక పోయిందని విమర్శించారు.