పెనుగొండలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మాతృమూర్తి మృతి

79பார்த்தது
పెనుగొండలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మాతృమూర్తి మృతి
పెనుకొండ పట్టణంలోని తోటగిరి వీధికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సురేష్ తల్లి నాగరత్నమ్మ గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు గురువారం అక్కడికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీరాములు, రమణమ్మ, శ్రీనివాసులు, నంజుండ, లక్ష్మి దేవమ్మ, సోము, గోపాల్, గోపి తదితరులు ఉన్నారు.