రేపు ఎర్రగొండపాలెంలో జాబ్ మేళా
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ జగ్జీవన్ భవన్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో.. రేపు (సెప్టెంబర్ 10)వ తేదీన మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ నాయుడు వెల్లడించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని యువతను శ్రీధర్ నాయుడు కోరారు.