గంట్యాడ మండలంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
గంట్యాడ మండలం నరవ పంచాయతీ పరిధిలో ఆదివారం పంచాయతీ బూత్ లెవెల్ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల నుండి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించారు. అర్హత గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.