విజయవాడ: బడ్జెట్ నిరుత్సాహ పరిచింది
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరుత్సాహ పరిచిందని వైసీపీ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అరకొర నిధులు, అంకెల గారడీతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించిందన్నారు. రూ. 2. 94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టినా ఏ రంగానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేకపోయిందన్నారు.