పత్తికొండ: తుగ్గలిలో 15. 8 మి. మీ వర్షపాతం నమోదు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వానలు కురిశాయి. తుగ్గలిలో 15. 8, మద్దికెరలో 11, ఓర్వకల్లులో 9. 2, పత్తికొండలో 8. 6 మి. మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటున 5 మి. మీ వర్షపాతం నమోదైంది. కాగా వెల్దుర్తిలో 24. 5 మి. మీ వర్షం, కృష్ణగిరి, పత్తికొండ, మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.