బోయ, వాల్మీకి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా కల్లూరు మండలానికి చెందిన తోల్లా మంజునాథ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గురువారం ప్రకటించిన డైరెక్టర్ల నియామక జాబితాలో కర్నూలు జిల్లాకు స్థానం దక్కింది. జనసేన పార్టీ తన సేవలు గుర్తించి బోయ, వాల్మీకి డైరెక్టర్ గా నియమించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఇంచార్జ్ చింత సురేష్ బాబుకు కర్నూల్ లో మంజునాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు.