Nov 04, 2024, 12:11 IST/
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Nov 04, 2024, 12:11 IST
కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టకండి. పదేళ్ల తరువాత అధికారంలోకి తేవడానికి కష్టపడ్డాం. నోటికాడ పళ్ళెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 10 సంవత్సరాలు సర్వశక్తులు ఓడిన కార్యకర్తలకు అండగా ఉండండి’’ అంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.