తిరువూరు: 20 లక్షల ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయం
20 లక్షల ఉద్యోగ కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా గురువారం తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు