రాజనగరం: గృహ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
రాజానగరం మండలంలోని వెలుగుబంద గ్రామంలో ఉన్న హౌసింగ్ కాలనీ వద్ద పేద ప్రజల ఇండ్ల నిర్మాణ పనులను స్థానిక అధికారులతో కలిసి శనివారం తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఈ సందర్భంగా హౌసింగ్ కాలనీ వద్ద పేదల గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై ఆమె స్థానిక అధికారులకు సూచనలు చేశారు. డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లాలో 2, 333 పేదల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం అని ఆమె అన్నారు.