సామర్లకోట కాకినాడ రోడ్ లో ట్రాఫిక్ జామ్
సామర్లకోట కాకినాడ రోడ్డు వి. కె రాయపురం మాదవ పట్నం గ్రామాల మధ్య మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడడంతో గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడడంతో, పెద్ద ఎత్తున సుమారు రెండు కిలోమీటర్ల పైబడి ట్రాఫిక్ నిలిచి వాహనాలు నిలిచిపోయాయి. గుంతలు మార్గంలో వాహదారులు అటు కాకినాడ, ఇట్లు సామర్లకోట ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు