కడప: కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి భారీగా పోలీసు బందోబస్తు
కడప మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి భారీగా పోలీసు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం జరుగుతున్న కౌన్సిల్ సమావేశానికి తెలుగుదేశం నాయకులు వచ్చి కూర్చుంటున్నారని వారి నుండి భయంగా ఉందని వైసీపీ కౌన్సిలర్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో కడప ఎస్పీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న ప్రాంతంలో ముడంచల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తికి ఐడి కార్డు ఉంటేనే ప్రవేశం కల్పిస్తున్నారు.