శావల్యాపురం మండల తహశీల్దార్ గా కే. సుజాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సుజాత సాధారణ బదిలీలో భాగంగా శావల్యాపురానికి వచ్చారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో గల రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు అందరూ సహకరించాలని కోరారు.