బుర్రిపాలెంలో దారుణ హత్య
తెనాలి మండలం బుర్రిపాలెంలో కోటేశ్వరరావు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బీరు బాటిల్ తో గొంతు కోసినట్లు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుని స్వగ్రామం తెనాలి మండలం బుర్రిపాలెం కాగా కొంత కాలం తెనాలిలో పోలీస్ జీబుకు డ్రైవర్ గా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాదులో సినీ నటులకు బౌన్సర్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం హైదరాబాదు నుంచి బ్యాంక్ పని మీద బుర్రిపాలెం రాగా హత్యకు గురయ్యాడు.