మంగళగిరి: నందిగం సురేష్ కు 18 రోజుల రిమాండ్ పొడిగింపు
బాపట్ల మాజీ ఎంపీ వైసిపి నేత నందిగాం సురేష్ కు కోర్టు 18 రోజులు రిమాండ్ పొడిగించింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామం లోని మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనను పోలీసులు సోమవారం మంగళగిరి కోర్టులో హాజరు పరచగా ఈనెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.