తాడేపల్లిగూడెం: వివాహిత అనుమానాస్పద మృతి
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పసుపులేటి వైష్ణవి (28) అత్తింటి వేధింపులు తాళలేక శుక్రవారం సాయంత్రం గోదావరి ఏలూరు ప్రధాన కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుడికి వెళ్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.