మచిలీపట్నం: భక్తుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న ఏఎస్ఐ
మచిలీపట్నం మంగినపూడి బీచ్ కు వచ్చిన వాహనదారుల వద్ద ఏఎస్ఐ నగదు వసూళ్లు చేస్తున్నట్లు భక్తులు ఆరోపించారు. డొంక రహదారి గుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులను అడ్డగించి వారి వద్ద నుంచి రూ. 150 నుంచి రూ. 500 వరకు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపించారు. ఇదేమిటని అడిగిన వాహనదారుల వాహనాల ప్లగ్ లు తీసుకొని ఇవ్వటం లేదని భక్తులు ఆరోపించారు. తక్షణమే జిల్లాస్థాయి అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.