గండేపల్లి: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో 12 మందిపై కేసు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ 12 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో 12 మందిపై కేసునమోదు చేసి బుధవారం పెద్దాపురం కోర్టుకు హాజరుపరిచారు. వీరిలో ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. పదివేలు జరిమానా విధించగా, ఐదుగురికి రెండు రోజులు, మరో ఐదుగురికి మూడురోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.