గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం , బాలకృష్ణ పురం పంచాయతీ అరుంధతి దళిత వాడకు చెందిన నిరుపేద యశోదమ్మ మూడేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో మంచానికే పరిమితమైంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నియోజకవర్గ ఇంచార్జి యుగంధర్ పొన్న నాయకులతో కలిసి సోమవారం సాయంత్రం యశోదమ్మకు వీల్ ఛైర్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం తరపున అండగా నిలబడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.