చిత్తూరు: ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ. ప్రభావతి దేవి జిల్లాలోని ఆశ నోడల్ అధికారుల మీటింగ్ లో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై శుక్రవారం సమీక్షించారు. ప్రస్తుతం వివిధ రకాల సర్వే కార్యక్రమాలు, క్యాన్సర్ స్క్రీనింగ్, స్కూల్ హెల్త్ స్క్రినింగ్, సాన్స్(నిమోనియా స్క్రీనింగ్), జరుగుతున్నందున ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఎస్కే డాక్టర్ శిరీష, ఎస్ఓ జార్జ్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.