కళ్యాణదుర్గం: అండర్ డ్రైనేజీ పనులతో స్తంభించిన ట్రాఫిక్
కళ్యాణదుర్గం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ డ్రైనేజీ పనుల కారణంగా మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఈ మేరకు ప్రయాణికులు మాట్లాడుతూ నిర్మాణ పనులు ప్రధాన సమస్యగా మారిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.