ఉత్తమ సామాజిక కార్యకర్తగా బెంజిమెన్
వజ్రకరూరు మండలంలో సామాజిక కార్యకర్త బెంజిమెన్ కు జిల్లా ఉత్తమ సామాజిక కార్యకర్తగా అవార్డును జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. వారు శాలువాతో ఘనంగా సత్కరించారు. పలువురు మండల అధికారులు, సామాజిక కార్యకర్త మల్లికార్జున, సర్పంచ్ మోనాలిసా, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.