Nov 25, 2024, 10:11 IST/
ఆ వాహనాలు రోడ్లపై తిరగొద్దు.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
Nov 25, 2024, 10:11 IST
TG: స్కూల్ బస్సులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీవో అధికారులను ఆదేశించారు. 15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలన్నారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, ఆర్సీ అన్నిటినీ చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా స్కూల్ టైమింగ్స్‌లో, విద్యార్థులు బస్సుల్లో ఉన్నప్పుడు తనిఖీలు చేయరాదని అధికారులకు సూచించారు.