విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ జల్లి సుభద్ర బుధవారం బుచ్చయ్య పేట మండలంలోని వడ్డాది హైస్కూల్ సందర్శించారు. సందర్భంగా స్మశాన వాటిక వద్ద త్రాగునీటి బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జడ్పీ గ్రాంట్స్ నిధులు అధికంగా త్రాగునీటి వసతులకు, పాఠశాల భవనాల నిర్మాణానికి వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక జడ్పీ హైస్కూల్ ని సందర్శించారు. హైస్కూల్లో వసతులను పరిశీలించారు.