విశాఖ: నీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహణకు యాక్షన్ ప్లాన్
గ్రామాల్లో నీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నీరు , పారిశుద్ధ్య మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంతో పాటు పారిశుద్ధ్య ప్రణాళికలు, అమలు చేయడం, కమ్యూనిటీ టాయిలెట్లు మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు.