విశాఖ : వంజంగి కొండల్లో సన్రైజ్ కనువిందు పోటెత్తిన పర్యాటకులు
అల్లూరి జిల్లాలోని వంజంగి కొండల్లో సన్ రైజ్ చూసేందుకు గురువారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఓ పక్కన చలి. మరో పక్కన పొగ మంచు దట్టంగా వ్యాపించి పర్యాటకులను ఆకర్షించింది. ఆంధ్రా, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్ పర్యాటకులు కూడా తరలి వచ్చారు. పాలసముద్రం లాంటి తెలియాడే పొగ మంచు చూసి మురిసిపోయారు. పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.