విశాఖలో 54 మాంసం దుకాణాలు సీజ్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన 54 మాంసం దుకాణాలను సీజ్ చేయడమైనదని జీవీఎంసీ వెటర్నరీ అధికారి డాక్టర్ కిషోర్ తెలిపారు. బుధవారం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన చికెన్, మటన్, చేపలు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.