భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. జూన్లో 6.6 శాతంగా ఉన్న అంచనాలను తాజాగా సవరించింది. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే మెరుగ్గా రాణించడంతో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. తక్కువ ద్రవ్యోల్బణం, సబ్సిడీలతో గ్రామీణ వినియోగం, ఆదాయపు పన్ను రాయితీలు, జీఎస్టీ కోతలతో పట్టణ వినియోగం పుంజుకున్నాయని పేర్కొంది. పారిశ్రామిక రంగం బలమైన పనితీరు కనబరుస్తోందని వెల్లడించింది.