న్యూజిలాండ్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు డిన్నర్ ఫోర్క్‌ను మింగేసింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమె వైకాటో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఎక్స్‌రే తీశారు. అప్పుడు కడుపులో ఫోర్క్ ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఎండోస్కోపీ ద్వారా తీయడానికి చేసిన రెండు ప్రయత్నాలు విఫలం కావడంతో, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఫోర్క్‌ను బయటకు తీశారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత రెండు రోజులకు డిశ్చార్జ్ అయిందని సమాచారం.