కేరళలోని కొట్టాయంకు చెందిన షైనీ కురియాకోజ్(42) అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు షైనీ తండ్రి ఆరోపిస్తున్నారు. గతంలో షైనీ తన భర్త నోబీ లూకోజ్‌పై గృహహింస కేసులు పెట్టిందన్నారు. శుక్రవారం ఎట్టుమనూర్‌లోని మణక్కపాడు రైల్వే ట్రాక్ వద్ద షైనీ తన కుమార్తెలు ఇవానా (10), అలీనా (11)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.