దీపావళి సందర్భంగా నవంబర్ 8న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఢిల్లీ, యూపీ, ఎన్సీఆర్లోని సాధారణ బార్లు, రెస్టారెంట్లలోనూ మద్యం సరఫరా నిలిపివేస్తారు. అయితే ప్రత్యేక లైసెన్సులున్న కొన్ని హోటళ్లలో గదుల్లో బస చేసే అతిథులకు రూమ్ సర్వీస్ ద్వారా మద్యం అందించవచ్చు. ధన్తేరస్, గోవర్ధన్ పూజ, భాయ్దూజ్ రోజుల్లో దుకాణాలు యథావిధిగా తెరిచి ఉంటాయి. రాష్ట్రాలవారీగా ఆంక్షలు మారవచ్చని అధికారులు సూచించారు. అయితే, ఏపీ, తెలంగాణలో మద్యం దుకాణాల మూసివేతపై రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.