తెలంగాణలో బీజేపీ అధ్యక్ష ఎంపిక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. భాద్యతలు ఎవరికి ఇస్తే సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే అంశంపై జాతీయ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. అయితే తెలంగాణాలో బీసీ వాదం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక వారికి సవాల్ గా మారిందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా ఏప్రిల్ లో జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక మార్చి నెలాఖరులోపు ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.