వీకెండ్ వచ్చిందంటే మాంసాహార ప్రియులు మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, కిడ్నీ సమస్యలు, గౌట్ లేదా యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు మటన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్‌లో ఉండే అధిక కొలెస్ట్రాల్, ప్యూరిన్, ప్రోటీన్ వంటి అంశాలు ఈ అనారోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా కేలరీల అధికం కారణంగా దీనికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.