డిజిటల్ మోసాలను అరికట్టేందుకు 9,400 అనుమానాస్పద ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. డిజిటల్ అరెస్ట్ కేసుకు సంబంధించిన విచారణలో భాగస్వామి అయ్యేందుకు వాట్సాప్‌నకు సుప్రీంకోర్టు అనుమతించింది. దేశంలో డిజిటల్ నేరాలు 50 శాతం వరకు తగ్గినప్పటికీ, బాధితులు ఇప్పటికీ సుమారు రూ.800 కోట్ల మేర నష్టపోయినట్లు కోర్టు వ్యాఖ్యానించింది. డిజిటల్ మోసాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బాధితుల నష్టాలపై విచారణ సందర్భంగా కోర్టులో చర్చ జరిగింది.