'మా అమ్మకు ఏమైంది.. అమ్మ.. లే అమ్మా'..

TG: జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లిలో విషాదం నెలకొంది. మహేశ్‌, స్రవంతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్రవంతి ప్రస్తుతం 8 నెలల గర్భిణి కాగా కడుపులో బిడ్డ కదలడం లేదని వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందగా.. కాసేపటికి పరిస్థితి విషమించి స్రవంతి కూడా చనిపోయింది. అయితే తల్లి మృతదేహం వద్ద కుమారుడు, కూతురు బిక్కుబిక్కుమంటూ చూడడం స్థానికులను కంటతడి పెట్టింది. 'మా అమ్మకు ఏమైంది.. లే అమ్మా' అని అక్కడున్నవారిని అమాయకంగా అడగడంతో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది.

தொடர்புடைய செய்தி