కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు గత ప్రభుత్వం రేషన్ కార్డులను కూడా నామమాత్రంగా ఇచ్చిందని చెప్పారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు.