వరంగల్ బల్దియా అదనపు కమిషనర్ గా జోనా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా పోలెపాక జోనాను నియమిస్తూ శనివారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న అదనపు కమిషనర్ రాజేందర్ రెడ్డికి సీడీఎంఏ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న జోనా కోసమే రాజేందర్ రెడ్డిని అధికార పార్టీ నేతలు బదిలీ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி