హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని వినతులను అందజేశారు. ప్రజల నుండి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 52 వినతులు ప్రజల నుండి అందాయని అధికారులు తెలిపారు.