వరంగల్: అభివృద్ధి పనులపై సమీక్షించిన నగర మేయర్

వరంగల్ నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియాలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ పథకాల క్రింద అభివృద్ధి పనుల పురోగతిని మేయర్ సమీక్షించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ అభివృద్ధి పనులకు రూ. 4170 కోట్లు, వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయుటకు రూ. 187 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி