వరంగల్ శాయంపేట రైల్వే గేట్ సమీపాన రైలు నుంచి జారి పడి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే 9441557232, 8712658585 నంబర్లకు కాల్ చేయాలన్నారు.