వరంగల్ జిల్లా అన్నారం యాకుబ్బాబా దర్గా దర్శనానికి వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గోపీ (45) అనే భక్తుడు శనివారం రాత్రి దర్గా సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద స్నానం చేస్తుండగా గుండెపోటుతో మృతిచెందారు. స్థానికులు, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా, సిబ్బంది వచ్చి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.