వరంగల్ దేశాయిపేట సికెఎం కళాశాల ప్రాంతంలో శనివారం ఒక షాపులో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వ్యవహరించిన ఘటన జరిగింది. షాపులో వస్తువులు కొనడానికి ముసుగులతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లారు. మాస్కులు ధరించి షాపులో కొనుగోలు చేసినట్లు వ్యవహరించి డబ్బులు ఇవ్వకుండా పిలుస్తుంటే వెళ్లిపోయారు. ద్విచక్ర వాహనంకు నెంబర్ ప్లేట్ లేకపోవడం, ముసుగులు ధరించడం పట్ల చైన్ స్నాచర్స్ గా స్థానికులు అనుమానిస్తున్నారు.